టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల(Sreenu vaitla) గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో శ్రీను వైట్ల నుంచి ఎటువంటి సినిమాలు రాలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే.
కానీ చాలా గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల ఒక హీరోతో కథ ఓకే చేయించుకుని సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ సినిమా ఫుల్ పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా కథని సిద్ధం చేసి హీరో గోపీచంద్ కి వినిపించడం అందుకు గోపీచంద్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే శ్రీను వైట్ల అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
హీరో గోపీచంద్ (Gopichand),తో ఒక ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.లిమిటెడ్ బడ్జెట్ లో గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా రూపొందించనుంది.ఈ మధ్యకాలంలో గోపీచంద్ నటించిన సినిమాల కూడా అంతంత మాత్రం గానే ఉంటున్నాయి.

నిజం చెప్పాలంటే గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లు అయ్యింది. లౌక్యం సినిమా తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు.మధ్యలో జిల్, గౌతమ్ నందా, సీటిమార్ (Seetimaarr)వంటి సినిమాలు బాగానే ఆడినా కూడా కలెక్షన్స్ ని తెచ్చిపెట్టలేకపోయాయి.
ఇక గతేడాది భారీ అంచనాల నడుమ విడుదల అయినా పక్కా కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది.మరి గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా ఇద్దరికీ ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.







