చాలామంది ప్రజలు భూమిని కొనుగోలు చేసేటప్పుడు ధరలు మాత్రమే చూస్తూ ఉంటారు.కానీ భూమిని కొనుగోలు చేసేటప్పుడు ధరల కంటే ముందు వాస్తును కచ్చితంగా చూడాలి.
కొనుగోలు చేసే స్థలానికి వాస్తు ఉంటే కొనుగోలు చేసే చేసిన వ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది.కొనుగోలు చేసిన స్థలానికి వాస్తు లేకుంటే కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క జీవితం ఊహించని ఇబ్బందులలో పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒక్కొక్కసారి తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా స్థలం యొక్క వాస్తు సరిగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం మంచిది.
తాజాగా ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా బంజరు భూములను, నెర్రెలు ఉన్న స్థలాలను, ఎలుకలు బొరియలు, చెదలు, పాముల పుట్టలు ఉన్న స్థలాలను, తవ్వితే ఎముకలు, బూడిద, బొగ్గు వంటివి బయటకు వచ్చే స్థలాలను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు.
ఈ స్థలాలను కొనుగోలు చేస్తే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే ఎటువంటి భూములను కొనుగోలు చేయవచ్చు అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా చెప్పాలంటే వ్యవసాయం చేయడానికి పనికి వచ్చిన భూములను కొనుగోలు చేయవచ్చు.పచ్చని చెట్లు, మొక్కలు, గడ్డి పెరిగిన భూములను కొనుగోలు చేయవచ్చు.భూమిని తవ్వితే రాళ్లు, ఇటుకలు, గులకరాళ్లు మొదలైనవి బయటకి వస్తే ఇలాంటి భూములను కొనుగోలు చేస్తే ఎటువంటి సమస్య ఉండదు.స్థలానికి నాలుగు దిక్కులలో దీపాలు వెలిగిస్తే అన్ని సమానంగా వెలిగితే అటువంటి భూములను కొనుగోలు చేయవచ్చు.
స్థలంలో గుంత తీసినప్పుడు ఆ గుంత నుంచి తీసినటువంటి మట్టిని మళ్లీ తిరిగి పూడిస్తే కొంత మట్టి మిగిలే భూములను కొనుగోలు చేయవచ్చు.మంచి భూమికి ఉండవలసిన లక్షణాలు ఉండి, వాస్తు బాగుంటే ఇలాంటి స్థలాలను కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.