ఎన్నారై దంపతులకు రూ.43 లక్షల టోపీ.. మోసం ఎలా చేశారంటే..

అంగడియా పద్ధతిలో తమ పెళ్లి కానుకలను విదేశీ కరెన్సీలోకి మార్చేందుకు ప్రయత్నించిన ఎన్నారై జంటకు భారీ షాక్ తగిలింది.ఈ నూతన వధూవరులను సూరత్‌కు చెందిన వ్యక్తి మోసం చేశాడు.

 Newlywed Nri Couple Cheated In Angadia System Rs. 43 Lakh , Newlywed Nri Coupl-TeluguStop.com

అంగాడియా వ్యవస్థ అనేది ఒక అనధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ.దీనిని వ్యాపారులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కెనడాకు(canada) చెందిన ఈ ఎన్నారై జంట తమ కరెన్సీని మార్చుకునే వ్యక్తిని కనుగొనడానికి సోషల్ మీడియా గ్రూప్స్‌లో వెతికారు.అప్పుడే వారికి సూరత్‌కి చెందిన యువకుడు పరిచయమయ్యాడు.

అతడే వీరిని మోసం చేశాడు.

తరువాత వరుడి సోదరుడు అర్పన్ పటేల్ కరేలిబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.అతని సోదరుడు జనవరి నెల, 2023లో ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్నాడని, ఆ జంటకు రూ.43 లక్షల నగదు బహుమతులు అందాయని పేర్కొన్నారు.ఆ నవ దంపతులు ఈ నగదు బహుమతులతో కెనడాలో ఇల్లు కొనాలనుకున్నారని, అందుకే రూపాయలను కెనడియన్ డాలర్లలోకి మార్చడానికి సహాయం కోరారని వివరించారు.

అరెస్టయిన వ్యక్తి రాంచోడ్ మెర్, మరో ఇద్దరు నిందితులు అంకిత్ సిద్పరా, ఆర్తి రదాడియాతో కలిసి ఆ నవ దంపతులను నమ్మించారు.తర్వాత ఎన్నారై దంపతులు సూరత్‌లోని మెర్‌కు అంగాడియా సర్వీస్(Angadia system) ద్వారా రూ.43 లక్షల క్యాష్ పంపించారు.మరో నిమిషంలోనే ఆ ముగ్గురూ తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేశారు.ఆ నిందితుల ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా రాంచోడ్ మెర్‌పై సూరత్‌లోని(Surat) వరచ్చా పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు మెర్‌ను ట్రాక్ చేసి శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు.

ఇప్పుడు ఈ నిండితుడు పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube