యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగైదు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.మొన్న జనవరిలోనే సినిమా రిలీజ్ కావలసి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఈ జూన్ నెలలో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఇక సలార్ సినిమా ను కూడా ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేశారు.
కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు.తాజా పరిణామాల నేపద్యంలో సలార్ సినిమా విడుదల అయ్యే పరిస్థితి కనపడటం లేదు అని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా ప్రభాస్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు, గత కొన్ని నెలలుగా బిజీ బిజీగా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకే కనీసం మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రభాస్ కి సూచించారట.ఆ కారణంగా ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అన్నిటిని కూడా క్యాన్సల్ చేయాలని విజ్ఞప్తి చేశాడట

.దాంతో సలార్ సినిమా విడుదల ఈ సంవత్సరంలో ఉండక పోవచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి.అంతే కాకుండా వచ్చే సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు.ఇటీవల అధికారికంగా తేదీ ని కూడా ప్రకటించారు.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ సినిమా కూడా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ఈ రెండు మాత్రమే కాకుండా ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమా ల విడుదల విషయం లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.







