రాష్ట్రంలో మహిళలపై హత్యలు,అత్యాచారాలు చేస్తున్న నేరస్తులను కాపాడుతున్న తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవ వేడుకలు జరిపే నైతికతను కోల్పోయిందని భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్,పీసీసీ డెలికేట్ తంగళ్ళపల్లి రవికుమార్ అన్నారు.బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలను ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా కౌన్సిలర్లు బహిష్కరించి,రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మా హక్కులను కాపాడండి, మాకు రక్షణ కల్పించండి అంటూ నల్ల బ్యానర్ తో నిరసన వ్యక్తం చేస్తూ నినదించారు.
ఈ సందర్భంగా పలువురు మహిళా కౌన్సిలర్లతో కలిసి వారు మాట్లాడుతూ
భువనగిరి పురపాలక సంఘం
లో మహిళ కౌన్సిలర్లు హక్కులను హరిస్తూ,వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అగౌరవ పరిచినందుకు మహిళా దినోత్సవ వేడుకలను బహిష్కరించిట్లు తెలిపారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువై మానభంగాలు,హత్యలు, ఆత్మహత్యలు, అరాచకాలు రోజురోజుకు పెరుగుతుంటే కేసీఆర్, కేటీఆర్ అత్యాచారానికి గురైన,ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించడం మర్చిపోయి,నేరాలకు పాల్పడిన వారికి కొమ్ము కాస్తూ,అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
మహిళా దినోత్సవం నాడు సన్మానాలు చేయడం కేవలం రానున్న శాసనసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మహిళలను టిఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకునే కుట్రలో భాగమేనని అన్నారు.మానభంగాలకు, హత్యలకు,ఆత్మహత్యలకు గురైన కుటుంబాలను పరామర్శించి,వాళ్లకు ప్రభుత్వపరంగా ఆర్థికంగా సాయం చేసి,అన్ని విధాలుగా అండదండగా ఉండి,మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టిననాడే మహిళలకు అరుదైన సన్మానమని తెలిపారు.
రోజుకో హత్య, మానభంగం జరుగుతున్నప్పుడు మహిళా దినోత్సవం ఏవిధంగా సంపూర్తి జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మహిళ కౌన్సిలర్లు పడిగెల రేణుక నల్లమాస సుమ తంగళ్ళపల్లి శ్రీవాణి మాట్లడుతూ కమిషనర్ చాంబర్ ముందు ఫోర్ట్ కో కింద మహిళలమైన మేము ఆర్తనాదాలు చేసి,మా హక్కులను కాపాడండి,మహిళా కౌన్సిలర్లను గౌరవించండి అంటే పట్టించుకోని ఈ టీఆర్ఎస్ పాలకవర్గంపైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని,మహిళా శక్తితో రాష్ట్ర ప్రభుత్వాన్ని, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ను గద్దె దింపి, మహిళా శక్తిని చాటుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు జనగాం కవిత, కోళ్ల దుర్గాభవాని,నజీమా నస్రిన్,పచ్చళ్ళ హేమలత, వడిచర్ల లక్ష్మి,నాయకులు 24వ వార్డు కౌన్సిలర్ రత్నపురం బలరాం,26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ,28వ వార్డు కౌన్సిలర్ కైరంకొండ వెంకటేష్,నల్లమాస వెంకటేష్,జనగాం నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.