హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో భారత దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమ గ్రూప్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి గౌతమ్ అదానీ తన అప్పులు తీర్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఓ అప్పును ముందుగానే చెల్లించినట్లు ప్రకటించింది.2025 ఏప్రిల్ వరకు గడువు ఉన్నప్పటికీ షేర్లను తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను ముందుగానే చెల్లించింది.గత నెలలోనూ 1.11 బిలియన్ డాలర్ల విలువ చేసే రుణాలను గ్రూప్ ముందుగానే చెల్లించిన సంగతి తెలిసిందే.