నేనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే గనక ఈ భయంకర యుద్ధాన్ని ఆపేవాడిని: ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ అంటే తెలియని జనాలు దాదాపుగా వుండరు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ అనేక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారారు.

తన వింత నిర్ణయాలతో అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకతను సంపాదించుకున్నాడు.అయితే యూఎస్ లో ఇతని మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతే సపోర్ట్ కూడా ఉండడం కొసమెరుపు.

లాస్ట్ ఎన్నికల్లో చాలా కొద్ది తేడాతోనే ట్రంప్ ఓడిపోవడం గమనార్హం.ఇప్పుడు మళ్ళీ యూఎస్ ఎన్నికలు దగ్గర పడడంతో ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.

ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ట్రంప్ నిర్ణయించుకోవడం ఇపుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Donald Trump, American, International, Trump-Latest News - Telugu

రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి, దానికోసం తన ఎన్నికల అజెండాను కూడా నిర్ణయించేసుకున్నారు.ఎప్పటిలానే అసాధ్యం అనుకునే విషయాలే తన అజెండా అంటూ ముందుకు వస్తున్నారు.దానికితోడు తాజాగా సంచలన ప్రకటనలు చేసి జనాలను అవాక్కయేలా చేస్తున్నాడు ట్రంప్.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ రష్యా.ఉక్రెయిన్ యుద్దంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు అయ్యేది కాదని చెప్పి అందరికీ అవాక్కయేలా చేసాడు.

Telugu Donald Trump, American, International, Trump-Latest News - Telugu

అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా గెలిస్తే ఒక్క రోజులోనే యుద్దం ఆపిస్తా అంటూ ట్రంప్ ప్రకటించి మరొక ఝలక్ ఇచ్చాడు.కాగా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్రంగా విఫలం అయ్యారు అంటూ ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపించారు.ట్రంప్ ప్రస్తుతం అనేక కేసుల్లో నేరారోపణ ఎదుర్కొంటున్నాడు.

అయినా కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు.మరోవైపు అమెరికన్ ఇండియన్ అయిన వివేక్ రామస్వామి కూడా తనదైన ప్రచారంతో దూసుకుపోతున్నారు.

స్టార్టర్స్ కోసం చైనాతో వ్యాపారం చేయకుండా అమెరికన్ సంస్థలను నిషేధిస్తానని చెప్పి వార్తల్లో నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube