మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.సాయినాథ్ సొసైటీ ఆవరణలో పూర్తిగా కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే బైకుతో పాటు వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్యనా? అనే కోణంలో విచారణ చేపట్టారు.







