డైరెక్టర్ సుకుమార్. ఈయన ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు అనే చెప్పాలి.
ఒక్క సినిమాతో ఈయన పేరు మారుమోగి పోతుంది.గత కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి కళ్ళలో పడ్డారు.
ఈ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తర్వాత కూడా వరుసగా మంచి మంచి సినిమాలు తీసి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఒకటి అరా సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇక సుకుమార్ గత సినిమా పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో ఈయన పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఇక ఇప్పుడు సుకుమార్ మాత్రమే కాదు ఈయన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చాలా మంది మన ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ గా పని చేసి ఏకంగా మెగా ఫోన్ పడుతూ అక్కడ కూడా సక్సెస్ అనిపించు కుంటున్నారు.మరి ఈయన శిష్యులు అంటే స్టార్ హీరోలు సైతం సై అంటున్నారు.ప్రముఖ నిర్మాతలు కూడా ఆలోచించకుండా ఓకే చెబుతున్నారు.
ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడిగా నెగ్గాడు.తొలి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు.

ఇక ఈయన ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తో సినిమా ప్రకటించాడు.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఈ డైరెక్టర్ కూడా సుకుమార్ శిష్యుడే.ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈయనకు దిల్ రాజు మరో భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అలాగే కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. ఈయన ప్రెజెంట్ సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష తెరకెక్కిస్తున్నాడు.కుమారి 21ఎఫ్ తో మంచి హిట్ అందుకున్న పల్నాటి సూర్య కూడా సుకుమార్ శిష్యుడు కావడం విశేషం.ఇలా సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు.







