ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కేసులో దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నాయకులు ప్రజాప్రతినిధులు అరెస్టు అవుతున్నారు.
ఈ కేస్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కుదిపేసింది.ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక మంత్రులు అరెస్టు కావడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో బీజేపీ పార్టీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు లేకపోయినా మనీష్ సిపోడియాను బీజేపీ అరెస్టు చేయించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన బిజెపి నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కన్నడ ప్రజల అవకాశం ఇస్తే ఢిల్లీ తరహాలో అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.బిజెపిది డబుల్ ఇంజిన్ కాదు డబుల్ కరప్షన్ ప్రభుత్వమని విమర్శించడం జరిగింది.
ఇదే సమయంలో బిజెపిని గెలిపించండి అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.కర్ణాటక రాష్ట్ర మంత్రులు 40 శాతం కమిషన్ అడుగుతున్నారని కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటీవల ప్రధాని మోడీకి రాసిన లెటర్ విషయాన్నీ కూడా… ఎన్నికల ప్రచారంలో గుర్తు చేయడం జరిగింది.
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే నిజాయితీతో అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇవ్వడం జరిగింది.







