పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నచ్చిన హీరోయిన్ ఈమె అవ్వడంతో తెలుగు ఫిలిం మేకర్స్ ఈమె వెంట పడుతున్నారు.
మొదటి సినిమా పెళ్లి సందడి నిరాశ పరిచిన కూడా శ్రీ లీల కి అవకాశాల విషయంలో కొదవ లేదు.ఇటీవల రవి తేజతో నటించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
దాంతో వరుసగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది.మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా పవన్ కళ్యాణ్ తో కూడా శ్రీ లీల నటించేందుకు ఛాన్స్ కొట్టేసిందని సమాచారం అందుతుంది.అయితే హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లో నటించబోతుందా లేదంటే సాహో సుజిత్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా లో శ్రీ లీల కనిపించబోతుందా అనే విషయం లో క్లారిటీ లేదు.ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా లో మాత్రం కచ్చితంగా శ్రీ లీల నటిస్తుంది అనేది సమాచారం.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు, కనుక శ్రీలీల కూడా సినిమా ఏది అయినా.దర్శకుడు ఎవరు అయినా కూడా ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.చాలా బిజీగా ఉన్న శ్రీ లీల వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది.
అయినా కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలని అభిమానులు శ్రీలీల కి సూచిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి జోడిలా శ్రీలీల ఎలా ఉంటుందా అని ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి.