బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా, గ్లామర్ బ్యూటీ గా శ్రీముఖి తన పరిచయంను బాగా పెంచుకుంది.తన అల్లర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని వారిని తన అభిమానులుగా మార్చుకుంది.
ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తను కూడా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకుంది.కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.
ప్రస్తుతం పలు షో లతో బాగా బిజీగా ఉంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో అవకాశం అందుకుంది.అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.

ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను మతి పోగొడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.

ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఇక ప్రస్తుతం ఆమె బిబి జోడితో పాటు మరికొన్ని షోలలో యాంకరింగ్ గా చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే బిబి జోడీకి సంబంధించిన గెటప్ ను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.అందులో తన అవుట్ ఫిట్ తో పాటు చూపులతో బాగా ఫిదా చేసింది.
ఇక ఆ ఫోటోలు చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఓ నెటిజన్.శ్రీముఖి అన్ని జోడీలు కలపడమేనా.
మరి మన జోడి ఎప్పుడు తెచ్చుకుంటావు అంటూ తన పెళ్లి గురించి ప్రశ్నించారు.అయితే శ్రీముఖికి ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
కానీ తాను మాత్రం ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే బతుకుతుంది.







