ఇటీవల అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలిచివేసింది.
రోడ్డుపై నిలబడిన ఆ బాలుడిపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా అది చేసి చివరికి ప్రాణాలు తీశాయి.అయితే అప్పటి నుంచి వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వారి గురించి రోజు ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.
కాగా ఈ వార్తపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించిన విషయం తెలిసిందే.మేయర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ అంబర్ పేట్ లో జరిగిన వీధి కుక్కల దాడిపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.అయితే ఆ బాలుడు తరపున చిన్నారి కుటుంబం కోసం వర్మ పోరాడగా ఫలితంగానే జిహెచ్ఎంసి ప్రదీప్ కుటుంబానికి 8 లక్షల రూపాయలు పరిహారంగా దక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఈ ఘటన పై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ.ఈ సందర్భంగా ఆర్జీవి మాట్లాడుతూ.నేను ప్రపంచంలో చూసిన అతి దారుణమైన ఘటనల్లో ఈ వీధి కుక్కల దాడి తొలి స్థానంలో ఉంటుంది.

ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందించకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం.అంబర్ పేట్ ఘటన జరగగానే జీహెచ్ఎంసి నగరంలో దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల కుక్కలు ఉన్నట్లుగా వారు లెక్కలు చెప్పారు.అయితే వారు ఏ ఆధారంగా చెప్పారు అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న అని వర్మ తెలిపారు.
కొందరు మన దగ్గరికి కుక్క వస్తే కదలకుండా అలాగే నిలబడాలని చెబుతున్నారు.ప్రపంచంలో ఎవడైనా అలా చేస్తాడా అంటూ వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

నేను వీధి కుక్కల గురించి మాట్లాడుతుంటే కొందరు పెంపుడు కుక్కల గురించి మాట్లాడుతున్నారు అంటూ మేయర్ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ మండిపడ్డారు.ఇక ఇంటర్వ్యూలో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో సోషల్ మీడియాలో నిలిచే రాంగోపాల్ వర్మ మొదటిసారిగా ఇలా ఒక చిన్నారి కుటుంబం తరపున పోరాడి వారికి న్యాయం చేయడంతో అభిమానులు, నెటిజెన్స్ రామ్ గోపాల్ వర్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







