ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా.ఇలా తెలుగులో వరుస సినిమాలలో నటించిన ఈమె కెరియర్ మొదట్లో వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా తెలుగులో ఈమె నటించిన సినిమాలలో హిట్ కన్నా ఫ్లాప్ అయిన సినిమాలు అధికంగా ఉన్నాయి.ఇలా తెలుగులో ఈమెకు కాస్త అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది అక్కడ కూడా ఫ్లాప్ సినిమాలను చవిచూడటంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కాకుండా ఈమె వెబ్ సిరీస్ లో నటించే సందడి చేశారు.అయితే ఈమె నటించిన వెబ్ సిరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఏకంగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం ఈమె సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి యోధ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ అయితే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయన్న విషయంలో సందేహం లేదు.
ఇలా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు.

తన మొదటి సినిమా మద్రాస్ కేఫ్ చేస్తున్నప్పుడు తనకు నటన పట్ల ఏమాత్రం అవగాహన మెలకువలు లేవని తెలిపారు.అయితే తెలుగులో అవకాశాలు రావడంతో నటనలో మెలకువలు తెలుసుకున్నానని తెలిపారు.ఇలా నటనలో ఎప్పటికప్పుడు మెలకువలు తెలుసుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చానని తెలిపారు.
ఇక తన గురించి వచ్చినటువంటి ట్రోల్స్ విషయంపై కూడా ఈమె స్పందించారు.కెరియర్ మొదట్లో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో తన గురించి వచ్చినటువంటి ట్రోల్స్ తనని బాధపెట్టాయని తెలిపారు.
ఇండస్ట్రీలో సక్సెస్ లేకపోతే ఒక మనిషిగా అసలు చూడరని ఈమె తెలిపారు.తాను పబ్లిక్ ఫిగర్ కాబట్టి.విమర్శలు తప్పవు.కాని తానెప్పుడూ.
విమర్శలు, ట్రోలింగ్స్ ను లెక్కచేయడను అంటోంది.వాటన్నింటికి సిద్ధపడే ఇండస్ట్రీలోకి వచ్చానంటూ ఈ సందర్భంగా తన గురించి వచ్చే ట్రోల్స్ పై స్పందించారు.








