టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు.ముద్రగడ కుటుంబాన్ని గతంలో చంద్రబాబు వేధించలేదా అని ప్రశ్నించారు.గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రజలు ఓ మూల కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.2024లో కూడా చంద్రబాబు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్తారని తెలిపారు.అనంతరం ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబును ప్రజలు తరిమి కొడతారని వెల్లడించారు.







