టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోకు అనసూయ గుడ్ బై చెప్పడం ఆమె అభిమానులలో చాలామందిని బాధ పెట్టింది.
విపరీతమైన, అగౌరవకరమైన టీఆర్పీ స్టంట్స్ వల్లే తాను జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పానని అనసూయ పరోక్షంగా కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో అనసూయ మళ్లీ జబర్దస్త్ షోకు రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది.
ప్రస్తుతం సౌమ్యారావు ఈ షోకు యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.సౌమ్యారావుకు కూడా రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది.టీవీ షోలకు అనసూయ దూరమైనా ఆమెకు ఈవెంట్లకు పని చేసే ఛాన్స్ దక్కడంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.

అనసూయ పారితోషికం రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో ఉంది.అనసూయ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.పుష్ప2 సినిమాలో అనసూయ మెయిన్ విలన్ గా కనిపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనసూయ రాబోయే రోజుల్లో ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.అనసూయను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల స్థాయిలో అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.అనసూయ తన రేంజ్ ను పెంచే పాత్రలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అనసూయ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అనసూయ వయస్సు పెరుగుతున్నా ఆమె అందం మాత్రం అస్సలు తగ్గట్లేదు.
సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ప్లానింగ్ అదుర్స్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.అనసూయ స్టార్స్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.







