వెయ్యి కోట్ల రూపాయల టార్గెట్ సినిమాలివే.. ఏ సినిమా ఆ రికార్డును సాధిస్తుందో?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలన్నీ 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాయి.పాన్ ఇండియా సినిమాగా మూవీ విడుదలై సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కష్టమేమీ కాదు.

 1000 Crore Rupees Targetted Movies Details Here Goes Viral In Social Media , Ha-TeluguStop.com

అయితే ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ కానున్న సినిమాలు ఏవి అనే ప్రశ్నకు మాత్రం ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఇప్పటికే పఠాన్ మూవీ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది రిలీజ్ కానున్న పుష్ప2 సినిమా కూడా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను కచ్చితంగా సొంతం చేసుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి.సుకుమార్ బన్నీ బాక్సాఫీస్ వద్ద సులువుగానే మ్యాజిక్ చేస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

Telugu Adipurush, Charanshankar, Maheshtrivikram, Pathan, Prabhas, Pushpa, Salaa

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ లేకపోవడంతో ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం కష్టమేనని చెప్పవచ్చు.సలార్ సినిమా మాత్రం సులువుగానే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.హరిహర వీరమల్లు, చరణ్ శంకర్ కాంబో మూవీ కూడా 1000 కోట్ల రూపాయల మార్క్ ను అందుకునే అవకాశం అయితే ఉంది.

Telugu Adipurush, Charanshankar, Maheshtrivikram, Pathan, Prabhas, Pushpa, Salaa

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి కూడా పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.సీనియర్ స్టార్ హీరోలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ హీరోల సినిమాలు సైతం 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.పాన్ ఇండియా సినిమాలు ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు సైతం అదిరిపోయే రేంజ్ లో లాభాలను అందిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube