తెలంగాణలో వీధి కుక్కల దాడుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా కుక్కల దాడులు, నియంత్రణపై సర్కార్ ప్రత్యేక గైడ్ లైన్స్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.
వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలన్న ప్రభుత్వం కుక్కలకు వంద శాతం స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మాంసం, మాంసం వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.అంతేకాకుండా కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను కూడా పెంచాలని తెలిపింది.
వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని వెల్లడించింది.మరోవైపు కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.







