కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొందించింది.విద్యార్థులలో కొత్త టాలెంట్ బయటకు తీసే తరహాలో.
కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ బట్టి బట్టే చదువు విధానాన్ని రూపుమాపే తరహాలో కేంద్రం ముందు అడుగులు వేసింది.దీనిలో భాగంగా గత ప్రాథమిక ఉన్నత విద్య తీరు తినులను పూర్తిగా మారుస్తూ విద్యా విధానం గతంలో 10+2+3 ఉండగా… దానిని 5+3+3+4గా మార్చింది.
అంతేకాదు దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే తరహాలో విద్యార్థులకు నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా నూతన విద్యా విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.

ఇక ఇదే సమయంలో పాఠశాలలో జాయిన్ అయ్యే విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త రూల్ జారీ చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే స్కూల్ లో జాయిన్ అయ్యే విద్యార్థి వయసు ఆరు సంవత్సరాలు ఉంటేనే అడ్మిషన్ ఇవ్వాలని ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేయడం జరిగింది.ఖచ్చితంగా ఈ రూల్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే ఆల్ రెడీ కేంద్రీయ విద్యాలయాలలో ఆరు సంవత్సరాలు ఉన్న విద్యార్థులకే ఒకటో తరగతి అడ్మిషన్ ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేయడం జరిగింది.నూతన విద్యా విధానంలో ఈ మేరకు ఈ నిబంధన విషయాన్ని గుర్తు చేసుకుని పాఠశాలలు అడ్మిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఇక ఇదే సమయంలో ఒకటో తరగతిలో చేరకముందు చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.







