ఓరమ్యాక్స్ సర్వే వేర్వేరు సర్వే ఫలితాలను ప్రకటిస్తుండగా ఆ ఫలితాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే.మోస్ట్ పాపులర్ స్టార్స్ ఆల్ ఇండియా జనవరి నెల సర్వే ఫలితాలు వెలువడగా ఈ జాబితాలో సౌత్ హీరోలు సత్తా చాటారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా బన్నీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
షారుఖ్ ఖాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా ప్రభాస్ నాలుగో స్థానంలో నిలిచారు.
బన్నీ రెండో స్థానంలో నిలవడంతో ఈ హీరో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.రాజమౌళి హీరోలను మించి బన్నీ క్రేజ్ ను పెంచుకున్నారని నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రభాస్ కు నాలుగో స్థానం దక్కడంతో ప్రభాస్ అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు.

ఈ జాబితాలో ఐదో స్థానంలో అక్షయ్ కుమార్ ఆరో స్థానంలో సూర్య నిలిచారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో ఏడో స్థానంలో మెరిశారు.మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.
రామ్ చరణ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా యశ్ పదో స్థానంలో నిలిచారు.ఈ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే కొంతమంది హీరోలకు టాప్10 లిస్ట్ లో చోటు దక్కకపోవడం ఫ్యాన్స్ ను సైతం హర్ట్ చేస్తోంది.కోలీవుడ్ స్టార్ హీరోలకు ఈ జాబితాలో ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం గమనార్హం.సౌత్ సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ సర్వేలో టాలీవుడ్ స్టార్స్ నంబర్ వన్ గా నిలిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.







