టీడీపీ అధినేత చంద్రబాబుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ విసిరారు.పోర్టుల్లో పీడీఎస్ రైస్ వెళ్తుందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.
దమ్ముంటే చంద్రబాబు తన రాజీనామా స్వీకరించాలని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు.తన మీద చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పారు.
లోకేశ్ ఎక్కడా పోటీ చేసినా గెలవడని తెలిపారు.పోర్టుల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ద్వారంపూడి విమర్శించారు.







