చైనా, అమెరికా మధ్య ప్రస్తుతం డైలాగ్ వార్ జరుగుతోంది.ఇరు దేశాలూ సై అంటే సై అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.
ఇటీవల చైనా అనుమానిత స్పై బెలూన్‌ను అమెరికా పేల్చి వేసింది.ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించి ఆ బెలూన్‌ను పేల్చి వేసింది.
దక్షిణ కరోలినా ఒడ్డున శనివారం ఇది జరిగింది.దీని వీడియో కూడా అమెరికా విడుదల చేసింది.
AIM-9X సైడ్‌విండర్ క్షిపణి ద్వారా అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్ -22 ఆ అనుమానాస్పద చైనీస్ స్పై బెలూన్‌ను పేల్చింది.వెంటనే ఆ చైనీస్ బెలూన్ ముక్కలు ముక్కలు అయింది.
అయితే దీని కోసం అమెరికా పెట్టిన ఖర్చు చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికా, కెనడా గగనతలంలో ఇటీవల కొన్ని అనుమానాస్పద బెలూన్లు ఎగురుతూ కనిపించాయి.వాటిని గూఢాచార్యం కోసం చైనా వినియోగిస్తోందని అమెరికా ఆరోపించింది.అయితే అవి కేవలం వాతావరణ మార్పుల కోసం ప్రయోగించినవని చైనా చెబుతోంది.నిఘా బెలూన్లు ఆరోపించిన అమెరికా కీలక చర్య తీసుకుంది.అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్ -22 దీని కోసం ఉపయోగించించింది.AIM-9X సైడ్‌విండర్ క్షిపణి ఉపయోగించి ఆ బెలూన్‌ను కూల్చేసింది.12 డాలర్ల విలువ ఉండే ఆ బెలూన్ కోసం అమెరికా ఏకంగా 4.39 లక్షల డాలర్ల విలువైన క్షిపణిని ప్రయోగించింది.దాని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.3.5 కోట్లు.ఇదే కాకుండా ప్రస్తుతం లాటిన్ అమెరికా ప్రాంతంలో మరో నిఘా బెలూన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది.
తమ దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు వచ్చినా ఊరుకునేది లేదని అమెరికా పేర్కొంది.అయితే 12 డాలర్ల విలువ ఉండే బెలూన్‌ను నాశనం చేసేందుకు 4.39 లక్షల డాలర్ల విలువైన క్షిపణిని ప్రయోగించడం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది.ఈ బెలూన్లు భూమి నుండి 24 వేల నుండి 37 వేల అడుగుల ఎత్తులో సులభంగా ఎగురుతాయి.
ఈ చైనా యొక్క ఈ బెలూన్ 60 వేల అడుగుల ఎత్తులో అమెరికా మీదుగా ఎగురుతోంది.ఈ కారణంగా, వాటిని భూమి నుండి పర్యవేక్షించడం చాలా కష్టం.
వారి ఎగిరే ఈ పరిధి వాణిజ్య విమానాల కంటే చాలా ఎక్కువ.చాలా వాణిజ్య విమానాలు 40 వేల అడుగుల ఎత్తుకు వెళ్ళవు.
ఫైటర్ జెట్‌లు అటువంటి పరిధిలో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.ఇవి 65 వేల అడుగుల వరకు వెళ్ళవచ్చు.
అయినప్పటికీ, యు -2 వంటి మరికొన్ని డిటెక్టివ్ విమానాలు 80 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి.ఏదేమైనా అమెరికా, చైనా మధ్య ఈ బెలూన్లు వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.







