యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మనస్సు మంచి మనస్సు అని ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు.కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోలేరనే సంగతి తెలిసిందే.
అయితే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు చేసిన సహాయం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తారకరత్నకు ఎన్టీఆర్ నెలకు 4 లక్షల రూపాయల సహాయం చేశారని సమాచారం అందుతోంది.
ఒక సందర్భంలో తారకరత్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు.ఈరోజు మా కుటుంబం ఈ విధంగా ఉండటానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు.
నా తమ్ముడు లేని పక్షంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తారకరత్న చెప్పుకొచ్చారు.నేను నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి సహాయం అందిందని ఆయన తెలిపారు.

అప్పటినుంచి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి తారకరత్నకు సహాయం అందుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారకరత్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఆ సహాయాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు.మరోవైపు ఈ ఘటన వల్ల తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

తారకరత్న మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నందమూరి కుటుంబంలో చోటు చేసుకుంటున్న విషాద ఘటనలు కుటుంబ సభ్యులను ఎంతగానో బాధ పెడుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తుండగా తర్వాత సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆకాశమే హద్దుగా తారక్ క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందడుగులు వేస్తున్నారు.







