కల్యాణ మండపంలో బట్టలు నలగకుండా డాన్స్ చేసిన కొత్త జంట... వీడియో వైరల్!

సోషల్ మీడియాలో చూసుకుంటే అనునిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి.

 The New Couple Danced In Kalyana Mandapam Without Breaking Their Clothes The Vid-TeluguStop.com

ఏదోఒక ప్రత్యేకత ఉంటేగాని జనాలని అవి మెప్పించవు.కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని ఆశ్చర్యంగా, మరికొన్ని చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి.

ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం నెటిజన్లను తెగ రంజింపజేస్తోంది.దేశీ పెళ్లిళ్లు అంటే సంగీత్‌, బారాత్ అంటూ రకరకాల సందళ్ళు నెలకొంటాయి.

ఇక్కడ కూడా ఆ రకమైన సంద‌డే కనిపిస్తోంది.

పెండ్లి వేడుక‌లో ఓ సిక్కు జంట చేసిన డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

డ్యాన్స్ ఫ్లోర్‌లో కూల్ స్టెప్స్‌తో వారు ఇచ్చిన క్రేజీ మూమెంట్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.హ‌తీంద‌ర్ సింగ్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా లక్షల్లో వ్యూస్, లైక్స్, కామెంట్స్ సొంతం చేసుకుంటోంది.

ఈ వీడియోలో యువ జంట రెమా, సెలెనా గోమెజ్‌ల కామ్ డౌన్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం స్పష్టంగా చూడవచ్చు.న‌వ దంప‌తులు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుండగా చుట్టూ చేరిన అతిధులు చ‌ప్ప‌ట్లు కొడుతూ వారిని ప్రోత్స‌హించారు.

ఇక వీరి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు వారికి ప‌దికి ప‌ది మార్కులు వేసేస్తున్నారు.ఎందుకంటే పెండ్లి వేడుకల్లో క‌ట్టూబొట్టూ చెద‌ర‌కుండా డ్యాన్స్ చేయ‌డం అంటే సాధారణమైన విష‌యం కాదంటూ వారిని తెగ పొగిడేస్తున్నారు.వ‌ధువు త‌మ వివాహ వేడుక‌ను ఆస్వాదించింది కాబట్టే ప‌దికి ప‌ది మార్కులంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేయడం విశేషం.ఇంకొందరు మాత్రం వారి బల్లె బల్లె డాన్స్ బదులు బ్రేక్ డాన్స్ వేసుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube