టాలీవుడ్ లో బుట్టబొమ్మ గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే.ఈమె స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.
అయితే గత కొన్నాళ్లుగా ఈమె చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.దీంతో పూజాకు మరో అవకాశం అందడం లేదు.
ప్రెజెంట్ ఈమె చేసిన రెండు సినిమాలు ఉన్నాయి.అవి కూడా ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ కాదు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీ చేస్తుంది.ఇది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ బుట్టబొమ్మను కలిశారు.

ప్రెజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.ఇక ఇప్పుడు ఇదే కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కోసం గత రెండేళ్లకు పైగానే వేచి ఉండి మరీ హరీష్ శంకర్ ఈ సినిమాను తీయడానికి సిద్ధం అయ్యాడు.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో కమిట్ అయ్యిన సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఇక ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ కాల్ షీట్స్ ఇచ్చాడని టాక్.ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మరోసారి పూజా హెగ్డేని కలిసి కథ గురించి కూడా చర్చించు కున్నట్టు తెలుస్తుంది.
దీంతో ఈమె తప్పుకుంది అనే వార్తలకు చెక్ పడింది.ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే ఫిక్స్ అయినట్టే.ఏప్రిల్ లో ఈ మూవీ షూట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు టాక్.చూడాలి ఈ మూవీపై ఎప్పుడు అప్డేట్ వస్తుందో.







