అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ అధికార పార్టీ వైసీపీపై విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా గుర్తింపు పొందిన రఘురామకృష్ణంరాజు.వైసీపీకి సంబంధించిన ప్రతి అంశం పైన రఘురామ తనదైన శైలిలో స్పందిస్తూ, విశ్లేషణ చేస్తూ ఉంటారు.
రాబోయే ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసేందుకు రఘురామ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది.తాజాగా వైసిపి 2024 ఎన్నికల్లో గెలిచే స్థానాల పై రఘురామ జోస్యం చెప్పారు.
వైసిపి 175 కు 175 స్థానాల్లోనూ గెలుస్తుంది అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు.వైసిపి గెలిచే స్థానాలపైన రిపోర్టులు ఇస్తున్నారు.
మనకు మనమే వై నాట్ 175 అనుకుంటే ఆ స్థానాలు మరిన్ని తగ్గే ప్రమాదం ఉందంటూ వైసీపీ అధిష్టానానికి చురకలు అంటించారు.
రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నారని రఘురామ చెప్పుకొచ్చారు మనకు మనమే సింహాలు అని, వై నాట్ 175 అని బీరాలకు పోతే ఆ 25 స్థానాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని రఘురామ హెచ్చరించారు.తన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రతిపక్ష అభ్యర్థులు 30 వేల కోట్ల మెజారిటీ గెలుస్తారని ఇప్పటికే పందేలు కాస్తున్నారని తనకు తెలిసిందని, ప్రజలు ఎందుకు మనకు దూరం అవుతున్నారో సమీక్షించుకోవాలని వైసిపి నేతలకు చురకలు అంటించారు.
మరో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగబోతూ ఉండడంతో గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు జనాలు హాజరవుతున్నారంటే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో సమీక్షించుకోవాలని సూచించారు.మనల్ని ఎవరు నమ్మనప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికిస్తానంటే దానికి బదులుగా ప్రతిపక్షాలు మా దరిద్రం నీవే అని ఓ రాజకీయ పార్టీగా స్టిక్కర్లు అతికిస్తామని చెబుతున్నారని రఘురామ అన్నారు .అంతేకాదు ఈ స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు.