వివాహ వేడుకలోనే వరుడికి వధువు షాక్.. బాధతో కుమిలిపోయాడు

సోషల్ మీడియాలో మనకు నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు కనిపిస్తుంటాయి.చాలా వీడియోలు మనలను నవ్విస్తుంటాయి.

 In The Wedding Ceremony Itself, The Groom Was Shocked By The Bride ,bride, Groo-TeluguStop.com

కొన్ని వీడియోలను చూసినప్పుడు అయ్యో పాపం అనిపించేలా ఉంటాయి.ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో జరిగే చాలా సన్నివేశాలు నవ్వులు పుట్టిస్తాయి.

పెళ్లి అంటేనే చాలా సందడిగా ఉంటుంది.వధూవరులను దీవించేందుకు చాలా మంది బంధువులు, సన్నిహితులు వివాహ వేడుకకు వస్తుంటారు.

ఈ క్రమంలో జరిగే చిన్న చిన్న గొడవలు చూపరులకు వినోదాన్ని పంచుతుంటాయి.ఇదే కోవలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వధూవరులు పెళ్లి వేడుకలో సంతోషంగా లేకుంటే వారి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని అర్ధం.ప్రేమ వివాహాలు అయితే చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉంటాయి.అయితే కాసేపటికే కలిసిపోయే అవకాశం ఉంది.పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, వధూవరులకు నిశ్చితార్థం తర్వాత మాటలు పెరుగుతాయి.

కాబట్టి పెళ్లి సమయానికి వారి మధ్య సంబంధాలు మెరుగు పడతాయి.అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకునే వారు మాత్రం వివాహ వేడుకలో భిన్నంగా ప్రవర్తిస్తుంటారు.

ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి తర్వాత వధూవరులు ఇద్దరూ భోజనానికి కూర్చుంటారు.ఫొటోగ్రాఫర్ల సూచనతో వరుడికి వధువు స్వీట్ తినిపిస్తుంది.మిగిలిన సగం మాత్రం తాను తినకుండా వెంటనే వరుడి ప్లేట్‌లోనే వేసేస్తుంది.ఈ హఠాత్పరిణామంతో వరుడు షాక్ అవుతాడు.అతడికి ఏడుపు ఒక్కటే తక్కువ.బిక్కమొకం వేసుకుని చూస్తుంటాడు.

తనలో తాను బాధ పడుతూనే దానిని కప్పి పుచ్చుకోవడానికి చూస్తుంటాడు.వారి మధ్య నవ్వుతూ ఉండే సన్నివేశాన్ని బహుశా ఫొటోగ్రాఫర్లు ఊహించి ఉంటారు.

అయితే అక్కడ అందుకు భిన్నంగా జరిగింది.memecentral.

tab అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube