టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బ్రహ్మాజీ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్రహ్మాజి ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రాజకీయ, సామాజిక విషయాలపై స్పందిస్తూ ఉంటాడు.
ముఖ్యంగా మెగా హీరోల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉంటాడు.తాజాగా చిరంజీవి గురించి మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు బ్రహ్మాజీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
![Telugu Beer, Brahmaji, Chiaranjeevi, Mentoo, Roja, Srikanth Reddy, Tollywood-Mov Telugu Beer, Brahmaji, Chiaranjeevi, Mentoo, Roja, Srikanth Reddy, Tollywood-Mov](https://telugustop.com/wp-content/uploads/2023/02/Brahmaji-tollywood-social-media-Srikanth-G-Reddy-mentoo-movie.jpg )
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బ్రహ్మాజీ ప్రస్తుతం # మెన్ టూ అనే సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మౌర్య సుధావరం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో బ్రహ్మాజీ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా కథలో భాగంగా వారం రోజుల పాటు పబ్ లో షూటింగ్ చేసినట్లు బ్రహ్మాజీ వెల్లడించాడు.
![Telugu Beer, Brahmaji, Chiaranjeevi, Mentoo, Roja, Srikanth Reddy, Tollywood-Mov Telugu Beer, Brahmaji, Chiaranjeevi, Mentoo, Roja, Srikanth Reddy, Tollywood-Mov]( https://telugustop.com/wp-content/uploads/2023/02/Brahmaji-tollywood-social-media-Srikanth-G-Reddy.jpg)
ఈ షూటింగ్ లో బ్రహ్మాజీ పాటు సీన్ కోసం షూటింగ్ లో పాల్గొన్న నటులు నిజంగానే ఒరిజినల్ బీర్స్ తాగారట.తీరా షూటింగ్ ముగిశాక బీరు సీసాలకైన బిల్లు లక్షల్లో రావడంతో నిర్మాత గుండె ఆగిపోయినంత పని అయ్యిందని, చేసేది ఏమీ లేక ఉసూరుమంటూ నిర్మాత పబ్ లో బీర్లకి అయిన బిల్ కట్టినట్లు సోషల్ మీడియా ద్వారా బ్రహ్మాజీ స్వయంగా వెల్లడించారు.ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
బ్రహ్మాజీ సినిమాలలో తన కామెడీతో నవ్వించడమే కాకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వంటి వేడుకలలో కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు.