మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ.రాజకీయాల వల్ల వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.
ఇటీవలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వాల్తేరు వీరయ్య ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోళా శంకర్’.
ఈ సినిమాకు చిరు మెహర్ రమేష్ వంటి ప్లాప్ డైరెక్టర్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.మరి మెహర్ రమేష్ చిరుకు హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
ఇక చిరు ఈ సినిమా తర్వాత మారుతి వంటి దర్శకుడితో కూడా సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు.ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ కాంబోలో సినిమా అనేది ఉంటుంది.

మరి ఇలా చిరు వరుసగా ప్లాప్ డైరెక్టర్ లకే ఛాన్స్ ఇస్తూ వారిని మళ్ళీ ఫామ్ లోకి తెస్తున్నాడు.స్టార్ హీరోలు సైతం అవకాశాలు ఇవ్వక పోవడంతో ఖాళీగా ఉంటున్న డైరెక్టర్లకు చిరు నేనున్నా అంటూ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాడు.ఇక తాజాగా మరో ప్లాప్ డైరెక్టర్ కు చిరు ఛాన్స్ ఇచ్చినట్టు తాజాగా సమాచారం అందుతుంది.ఆ డైరెక్టర్ ఎవరో కాదు.సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ.

ఈ సినిమా తర్వాత మూడు నాలుగు సినిమాలు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు.ఈ క్రమంలోనే ఇతడు చిరుని కలిసి కథ వినిపించగా ఆయన ఓకే చెప్పినట్టు టాక్.మెగా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇతడు చిరు తో సినిమా చేయడం ఖాయం అని బలంగా వినిపిస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక రియల్ ఫ్యామిలీ స్టోరీ అని టాక్.చూడాలి ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో.







