పబ్లిక్, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో రైల్వేది కీలక పాత్ర అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రైల్వే సేవలను మారుమూల ప్రాంతాలకు తీసుకు వెళ్లాలనేది రైల్వేశాఖ లక్ష్యమని తెలిపారు.
ఏపీలో మౌలిక వసతులకు రైల్వేశాఖ బడ్జెట్ లో రూ.8,406 కోట్లు కేటాయించినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ మేరకు విజయవాడ – హుగ్లీ ఎక్స్ ప్రెస్ నర్సాపురం వరకు, నంద్యాల – కడప ప్యాసింజర్ రేణిగుంట వరకు పొడిగింపు కానుందని పేర్కొన్నారు.అదేవిధంగా విశాఖ -విజయవాడ ఎక్స్ ప్రెస్ గుంటూరు వరకు విస్తరించనుందని తెలిపారు.
ఎయిర్ పోర్టుల తరహాలోనే విజయవాడ రైల్వేస్టేషన్ ను ఆధునీకరిస్తామని చెప్పారు.విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ అద్దాలతో స్పెషల్ ట్రైన్ నడుపుతామని, అంతేకాకుండా రాజమండ్రి రైల్వేస్టేషన్ ను ఆధునీకరించబోతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.







