పిల్లలకు రోబోతో పాఠాలు... ప్రొఫెసర్ ఐడియాకి ఫిదా!

ప్రస్తుతం టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.నేటి దైననందిత జీవితంలో మనిషి అనేవాడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెక్నాలజీపైన ఆధారపడవల్సిన పరిస్థితి.

 Lessons With A Robot For Children... Professor's Idea! Robot Teacher, Robot As C-TeluguStop.com

ఈ క్రమంలోనే కొత్త కొత్తగా స్మార్ట్ ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

దీనితో ఉత్పాదకత పెరిగి, ఎక్కువ మంది చేసే పనులను రోబో అతిసునాయసంగా తక్కువ సమయంలో చేసేస్తోంది.కొన్ని షోరూమ్ లు, హోటల్స్ లలో, ఇంట్లో పనులు చేయడానికి ఇప్పటికే ఆర్టిఫిషియల్ రోబోలను కొన్ని కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు.

అంతేకాకుండా ప్రమాదకర ప్రదేశాలలో కూడా రోబోలను వాడుతున్నారు.

Telugu Mes, Kannada, Robot Teacher, Robot Class-Latest News - Telugu

తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒక స్కూల్ లో రోబో ఏకంగా పిల్లలకు పాఠాలను బోధిస్తుంది.ఉత్తర కన్నడలో స్థానికంగా ఉన్న షిర్సీ ప్రాంతంలో ఉన్న MES చైతన్య కాలేజీలో అక్షయ్ మషేల్కర్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆయన తన స్కూల్ పిల్లలకు చాలా వినూత్న రీతిలో పాఠాలు చెబుతుంటారు.అందుకే ఆయనంటే సదరు పాఠశాలలోని పిల్లలకు మక్కువ ఎక్కువ.ఈ క్రమంలో ఆయన కాస్త వినూత్నంగా ఆలోచించారు.పిల్లలకు రోబోట్ తో పాఠాలు చెప్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు.

Telugu Mes, Kannada, Robot Teacher, Robot Class-Latest News - Telugu

అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు.తన శిష్యుడైన ఆదర్శ్ దేవడిగ నిర్మించిన ఈ రోబోట్ ను స్కూల్ కు తీసుకొచ్చేసాడు.దానిలో ఎలక్ట్రిక్ పవర్డ్ రోబో, దీనిలో ముందుగానే అనేక రకాల సెన్సార్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి.పిల్లలకు బోధించాల్సిన సిలబస్, అనేక రకాల కాంపిటిషన్స్ లను అందులో ముందుగా ఇన్ స్టాల్ చేశారు.

అంతే కాకుండా… ఈ బొమ్మటీచర్ చెబుతున్న పాఠాలను స్కూల్ లోని విద్యార్థులు కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నారని సమాచారం.ఇప్పటి వరకు కరోనా వలన ఫోన్ లలో పాఠాలు విన్న స్టూడెంట్స్ ప్రస్తుతం, రోబో టీచర్ చెబుతున్న పాఠాలు వింటుండటం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube