టాలెంటెడ్ డైరెక్టర్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి.ఈయన తీసింది మూడు సినిమాలు అయినా కూడా ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
వెంకీ అట్లూరి తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలు చేసి మంచి ఇంప్రెషన్ దక్కించు కున్నాడు.వరుసగా మూడు ప్రేమ కథలను తెరకెక్కించిన వెంకీ ఈసారి రూటు మార్చాడు.
ఈసారి జోనర్ మార్చి ఏకంగా సోషల్ ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో వెంకీ అట్లూరి ‘సార్‘ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా.
జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగా అలరిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేయనున్నారు మేకర్స్.మరి దీని గురించి గత రెండు మూడు రోజులుగా ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతి త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కు గెస్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ టాక్ వచ్చింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో రావడం అయితే కన్ఫర్మ్ అయ్యింది.కానీ ముందు నుండి వచ్చిన టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ రావడం లేదట.ఈ వేడుకకు మెగాస్టార్ విచ్చేయనున్నారు అని తాజా టాక్.మార్ దీనిపై త్వరలోనే అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది.







