ఆ మూవీ డిజాస్టర్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ముందే తెలుసా.. ఏమైందంటే?

కప్పెలా మూవీ రీమేక్ గా తెరకెక్కిన బుట్టబొమ్మ మూవీ తెలుగులో సంచలనాలు సృష్టిస్తుందని అందరూ భావించగా ఈ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచి ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.ఎన్నో అంచనాలతో ఈ సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి పూర్తిస్థాయిలో నిరాశ చెందారు.

 Trivikram Srinivas Comments About Buttabomma Movie Result Details, Trivikram Sri-TeluguStop.com

ఈ సినిమా మామూలు బొమ్మేనని బుట్టబొమ్మ కాదని నెటిజన్ల ఉంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా డిజాస్టర్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందే చెప్పారని నాగవంశీ తెలిపారు.

బుట్టబొమ్మ ఫ్లాప్ అని నాగవంశీ సైతం అంగీకరించడం గమనార్హం.త్రివిక్రమ్ ఊహ ఈ సినిమా విషయంలో నిజమైందని ఆయన చెప్పుకొచ్చారు.

కప్పెలా నచ్చి ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నామని అయితే మూడు సంవత్సరాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నాగవంశీ కామెంట్లు చేశారు.

Telugu Buttabomma, Buttabomma Flop, Sir-Movie

ప్రేక్షకుల అభిరుచి మారిపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందని నాగవంశీ చెప్పుకొచ్చారు.బుట్టబొమ్మ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోలేదని ఆయన అన్నారు.బాబాయ్ రాధాకృష్ణ సైతం ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని భావించారని నాగవంశీ తెలిపారు.

సార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ ఈ విషయాలను వెల్లడించారు.

Telugu Buttabomma, Buttabomma Flop, Sir-Movie

సార్ మూవీ చదువు గొప్పదనం గురించి చెబుతుందని చదువు వెనుక ఉండే కష్టం గురించి ఈ సినిమా ద్వారా తెలుస్తుందని నాగవంశీ పేర్కొన్నారు.తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆయన తెలిపారు.జులై నెలలో టిల్లు స్వ్కైర్‌ రిలీజవుతుందని ఆగష్టులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు.టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube