సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రిటీలుగా కొనసాగుతున్న చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి తెలియని విషయం తెలిసిందే.అయితే నిజామాబాద్ నుంచి చాలామంది సెలబ్రిటీలు వచ్చి తమదైన ముద్రణ వేసుకున్నారు.
డైరెక్టర్లుగా హీరోలుగా యాంకర్లుగా ప్రతి ఒక్కరంగంలో నిజామాబాద్ కి చెందిన చాలామంది మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.మరి వాళ్ళు ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్న విషయాలు గురించి ఇప్పుడు మనం.యాంకర్ శ్రీముఖి. నిజామాబాద్ కి చెందిన శ్రీముఖి యాంకర్ గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవడం తో పాటు టాప్ 5 యాంకర్లలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తుంది.అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిజమాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్ పల్లికి చెందిన వ్యక్తి.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే.అలాగే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లలో ఒకరిగా రాణిస్తున్న కమిడియన్ వెన్నెల కిషోర్ కామారెడ్డి కి చెందిన వ్యక్తి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేసిన వెన్నెల కిషోర్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్రను వేసుకున్నారు.అలాగే కామారెడ్డి పట్టణానికి చెందిన మరో నటి అదితి మ్యాకాల్.

ఈమె నటిగా పలు సినిమాలలో నటించడంతోపాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.నిజామాబాద్ కు చెందిన హీరో నితిన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు నితిన్.అలాగే గాంధారి మండలం వెంకటాపూర్ కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వెండితెరపై బుల్లితెరపై కామెడీ చేస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చమ్మక్ చంద్ర. కేవలం వీరు మాత్రమే కాకుండా నిజామాబాద్ నుంచి వచ్చే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు.







