విశాఖ జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది.ఏయూలో సెక్యూరిటీ గార్డులు నిషేధిత గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ వ్యవహారంలో ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవర్ కీలక సూత్రధారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేశారు.మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గంజాయిని అక్రమంగా తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.







