జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా జబర్దస్త్ కమెడియన్లగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి వదిలిపోయి ఇండస్ట్రీలో బిజీగా గడుపుతుండగా ఆర్పీ మాత్రం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.ఇలా ఈయన బుల్లితెరకు దూరమైన అనంతరం ఏకంగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.
ఆర్పీ నెల్లూరుకు చెందిన వ్యక్తి కావడంతో ఈయన తన నెల్లూరు చేపల పులుసుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించగా ఈ రెస్టారెంట్ ఎంతో సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం బిజినెస్ లో ఎంతో బిజీగా మారిపోయారు.

ఆర్పీనెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ నిర్వహించారు.అయితే ఈ కర్రీ పాయింట్ తక్కువ సమయంలోనే ఎంతో ఫేమస్ కావడంతో ఈయన రెస్టారెంట్ ముందు కస్టమర్లు బారులు తీరేవారు.ఇలా అందరికీ సరిపడా కర్రీ అందించలేని పక్షంలో ఆర్పీ తన రెస్టారెంట్ ను కొద్దిరోజులు మూసివేసి తిరిగి మరీ ప్రారంభించారు.
ఇలా తనరెస్టారెంట్ బిజినెస్ ఎంతో సక్సెస్ గా ముందుకు వెళుతున్న నేపథ్యంలో కొందరు తన రెస్టారెంట్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆర్పీ ఆరోపణలు చేశారు.

ఇలా నీతిగా నిజాయితీగా బిజినెస్ చేసుకుని తన గురించి ఎంతమంది చెడుగా ప్రచారం చేసిన తనకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన రెస్టారెంట్ బిజినెస్ ఇలా సక్సెస్ కావడానికి తనని ఆదరించిన ప్రతి ఒక్కరికి ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.ఇక అదిరే అభి మీరు ఓవర్సీస్ లో కూడా రెస్టారెంట్ పెట్టాలని కోరుకున్నారు.
దానికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఆర్పీసమాధానం చెబుతూ తనకు ఈ బిజినెస్ లో కాస్త అనుభవం మరింత మాన్ పవర్ లభిస్తే తన చేపల పులుసును అమెరికాలో కూడా తెలుగువారి కోసం ఏర్పాటు చేస్తానని త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాల గురించి క్లారిటీ ఇస్తానని తెలియజేశారు.ఇలా తన రెస్టారెంట్ గురించి ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







