అమరావతి విభజన చట్టం ప్రకారమే.. కేంద్ర మంత్రి స్పష్టం

ఏపీ రాజధాని అంశంపై కేంద్రం స్పందించింది.అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.

విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 తో రాజధాని అమరావతి ఏర్పడిందని పేర్కొన్నారు.మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని కేంద్రం వెల్లడించింది.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు.అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారన్నారు.

అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఏపీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్రం వెల్లడించింది.

Advertisement

అమరావతి అంశంపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేసింది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు