'సలార్' టీజర్.. ఏప్రిల్ లో డార్లింగ్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఉండనుందా?

బాహుబలి సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.మరి ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

 Salaar Official Teaser On April 2, Salaar, Salaar Official Teaser, Prabhas, Shru-TeluguStop.com

వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Salaarofficial-Movie

మరి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్‘ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.అలాంటి భారీ హిట్ తర్వాత నీల్ చేస్తున్న సినిమా సలార్ కావడంతో ఈ సినిమాపై కూడా మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Salaarofficial-Movie

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ వచ్చింది.ఈ సినిమా టీజర్ త్వరలోనే రాబోతుంది అని టాక్ వస్తుంది.ఏప్రిల్ 2న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

మరి త్వరలోనే దీనిపై అఫిషియల్ అప్డేట్ కూడా రానుందట.ఈ సర్ప్రైజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇది పక్కన పెడితే.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

కెజిఎఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఇక డార్లింగ్ ఈ సినిమాతో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube