సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.దర్శకులు ఒకసారి ఫ్లాప్ ఇస్తే మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు అస్సలు ఇష్టపడరు.
అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం దర్శకులు ఒకసారి ఫ్లాప్ ఇచ్చినా మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో కంత్రి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన కంత్రి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ఫలితాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇదే కాంబినేషన్ లో శక్తి పేరుతో మరో మూవీ తెరకెక్కగా శక్తి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
రెండుసార్లు ఛాన్స్ ఇచ్చినా మెహర్ రమేష్ తారక్ ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోలేదనే చెప్పాలి.

ఆంధ్రావాలా సినిమాతో తనకు ఫ్లాప్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ కు టెంపర్ సినిమతో తారక్ మరో అవకాశం ఇచ్చారు.టెంపర్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.షాక్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా రవితేజ హరీష్ శంకర్ కు మరో ఛాన్స్ ఇవ్వగా ఈ కాంబోలో వచ్చిన మిరపకాయ్ మూవీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
గౌతమ్ నంద ఫ్లాప్ అయినా సంపత్ నందికి గోపీచంద్ మరో ఛాన్స్ ఇచ్చారు.

ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా మహేష్ త్రివిక్రమ్ కు మరో ఛాన్స్ ఇవ్వగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.వరుడు మూవీ ఫ్లాప్ అయినా బన్నీ గుణశేఖర్ డైరెక్షన్ లో రుద్రమదేవి మూవీలో నటించి సక్సెస్ సాధించారు.రమేష్ వర్మ, పరశురామ్ తనతో తీసిన సినిమాలు ఆకట్టుకోకపోయినా రవితేజ వాళ్లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు.







