డార్లింగ్ లిస్ట్ చూస్తుంటే.. ఈయన్ని అందుకోవడం అసాధ్యమే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న మొదటి తెలుగు హీరో ప్రభాస్ కావడం విశేషం.

 Not Possible To Reach Prabhas After These Films, Prabhas, Salaar, Adipurush, Spi-TeluguStop.com

ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టాడు.ఇక ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ప్రెజెంట్ అన్ని వందల కోట్ల ప్రాజెక్టులను చేస్తూ మరో ఐదేళ్ల పాటు తన కాల్ షీట్స్ ఖాళీ లేకుండా చేసుకున్నాడు.

ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘సలార్‘ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Salaar, Adipurush, Reach Prabhas, Prabhas, Project, Shruti Haasan, Spirit

ఇక డార్లింగ్ ఈ సినిమాతో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ప్రాజెక్ట్ కే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.

ఇక మారుతి దర్శకత్వంలో కూడా రాజా డీలక్స్ అనే క్రేజీ సినిమాను చేస్తున్నాడు.

Telugu Salaar, Adipurush, Reach Prabhas, Prabhas, Project, Shruti Haasan, Spirit

స్పిరిట్ సినిమా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇవే కాదు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో చేసిన ఆదిపురుష్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.ఇలా ప్రభాస్ సినిమాల లిస్ట్ చూస్తుంటే పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడం పక్కా అని చెప్పవచ్చు.

దీంతో ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని చెప్పాలి.ఈ సినిమాలతో రెబల్ స్టార్ తప్పకుండ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించడం ఖాయం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube