తెర వెనుక గర్జించిన సింహం,ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మృతి ఇండస్ట్రీకి తీరనిలోటు అని చెప్పాలి.సూర్య నటించిన సింగం సినిమా తెలుగు వెర్షన్ లో సూర్యకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి నేడు ఉదయం గుండెపోటుతో చెన్నైలోని తన స్వగృహంలో మరణించారు.
ఇలా ఈయన మరణ వార్తతో ఇటు తెలుగు ప్రేక్షకులు అటు తమిళ ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈయన కోలీవుడ్ హీరోలైనటువంటి విక్రమ్ అజిత్ సూర్య వంటి హీరోల సినిమాలు తెలుగులో విడుదల కాగా తెలుగులో ఈయన ఆ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
ముఖ్యంగా సూర్య నటించిన యముడు సింగం సిరీస్ లకు ఈయన వాయిస్ ఎంతో అద్భుతంగా సెట్ అయింది ఇలా తెరువెనక గర్జించిన సింగం కన్ను మూయడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి మరణ వార్తపై సూర్య స్పందించి ఎంతో ఎమోషనల్ అయ్యారు.శ్రీనివాస్ మూర్తికి సూర్యకు ఎంతో మంచి అనుబంధం ఉంది.ఈ క్రమంలోనే సూర్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… శ్రీనివాస్ మూర్తి గారి మరణం తనకు పర్సనల్ లాస్ అని, తన వాయిస్, ఎమోషన్స్ నేను చేసిన పాత్రలకు తెలుగులో ప్రాణం పోసాయి.
మిస్ యు సర్ అంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు.

ఇలా శ్రీనివాస్ మూర్తి మరణంపై సూర్య స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఎలాంటి ఎమోషన్ డైలాగ్స్ అయిన ఎలాంటి ఘంబీరమైన డైలాగులనైనా ఎంతో అద్భుతంగా హావ భావాలను పలికిస్తూ డబ్బింగ్ చెప్పే ఈయన మరణ వార్త తెలిసినటువంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఈయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇక ఈయన వాయిస్ కి తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.







