బాలయ్య నాగ్ మధ్య తేడా ఇదే.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున అలా చేయడంతో?

స్టార్ హీరో బాలకృష్ణ పబ్లిక్ ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో మాట్లాడే సమయంలో కొన్నిసార్లు మాట తడబడటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు.అయితే ఏఎన్నార్ గురించి హర్ట్ చేసేలా బాలయ్య కామెంట్లు చేయడం ఫ్యాన్స్ ను బాధ పెట్టగా ఏఎన్నార్ వర్ధంతి రోజున ఆ కామెంట్లు చేయడం అక్కినేని ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

 This Is The Difference Between Balakrishna And Nagarjuna Details Here Goes Viral-TeluguStop.com

అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఏ విధంగా సమర్థించుకుంటారో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో ఎన్టీఆర్ వర్ధంతి రోజున బంగార్రాజు మూవీకి సంబంధించిన ఈవెంట్ జరగగా ఈ విజయాన్ని చూసినప్పుడు నాకు కానీ చైతన్యకు కానీ అఖిల్ కు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారికి థాంక్యూ చెప్పుకోవాలని అనిపిస్తుందని నాగ్ తెలిపారు.

ఇదంతా ఆయన మాకు ఇచ్చారని ఈ ప్రేమను అంతా ఆయన చూపించారని పేర్కొన్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీకి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని నాగ్ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Nagarjuna, Ntr Anniversary, Tollywood-Movie

ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాగ్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఉన్నంత వరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ లను మనం గుర్తు చేసుకోవాలని గుర్తు చేసుకుంటామని కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ లివ్స్ ఆన్ అలాగే ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని నాగ్ కామెంట్లు చేశారు.అటు ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఇటు ఏఎన్నార్ గొప్పదనం గురించి నాగ్ చెప్పుకొచ్చారు.నాగ్ మాటలకు బాలయ్య మాటలకు చాలా తేడా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Balakrishna, Nagarjuna, Ntr Anniversary, Tollywood-Movie

బాలయ్య తన కుటుంబం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా తప్పు లేదని అయితే ఇతర కుటుంబాలను కించపరిచే విధంగా కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగార్జునపై కోపం ఉంటే ఆ కోపాన్ని బాలయ్య డైరెక్ట్ గా చూపించాలే తప్ప ఈ విధంగా చూపించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube