ఏపీ వ్యాప్తంగా రోడ్ల రిపేర్లను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ క్రమంలో పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు చేసేందుకు రూపొందించిన ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ ఎవరైనా ఈ యాప్ ద్వారా రోడ్ల గురించి ఫిర్యాదు చేయవచ్చు.అదేవిధంగా రోడ్ల దుస్థితిపై ఫోటోలను సైతం అప్ లోడ్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
జియో కోఆర్డినెట్స్, ఫిర్యాదుతో పాటు దీనిపై కమాండ్ కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ఈ క్రమంలో ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టనున్నారు.







