బుల్లితెర మేల్ యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు.కొంత కొంతకాలంగా ఎన్నోకార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అనంతరం హీరోగా కూడా అవకాశాలను అందుకున్నారు.
ఇలా ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తరచూ తన పెళ్లి గురించి వార్తల్లో నిలుస్తున్నారు.ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ఈయనకు పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి.

తాజాగా ఈయన ప్రముఖ డిజైనర్ నవ్య మారోతూతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో ప్రదీప్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రదీప్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు.అంటూ ఆనందపడిన కొంత క్షణానికే ప్రదీప్ ఈ వార్తలపై స్పందించి అభిమానుల సంతోషం పై నీరు చల్లారు.తనకు నవ్య మారోతూకు వివాహం అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఇప్పటివరకు తాను ఒక్కసారి కూడా ఆ అమ్మాయిని కలవలేదు అంటూ షాక్ ఇచ్చాడు.

ఇకపోతే తాజాగా ప్రదీప్ మరోసారి తన పెళ్లి గురించి స్పందించారు.ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు రఘుకుంచే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రఘు కుంచె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అనే వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ మేటర్ ఏంటని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ప్రదీప్ సమాధానం చెబుతూ.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నేను కూడా షాక్ అవుతానంటూ ప్రదీప్ కామెంట్ చేశారు.ఇలా ఈయన చేసిన కామెంట్స్ చూస్తే మాత్రం ఇతను ఇపుడే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరని స్పష్టంగా అర్థం అవుతుంది.







