ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” టాకీ షో రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.2022లో మొదటి సీజన్ లో సినిమా సెలబ్రిటీలు రాగా ప్రస్తుతం జరుగుతున్న సెకండ్ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు.సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.రెండు ఎపిసోడ్ లుగా ఇది స్ట్రీమింగ్ అవుతూ ఉంది.ఇప్పుడు ఆహా వీక్షకులు పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
గత ఏడాది డిసెంబర్ నెలలోనే పవన్ ఎపిసోడ్ షూటింగ్ జరుపుకుంది.
దీంతో సంక్రాంతికి స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు.సంక్రాంతి అయినా గాని స్ట్రీమింగ్ కాలేదు.
ఈ క్రమంలో తాజాగా ఆహా పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేసింది.ఈ ఎపిసోడ్ లో పవన్ సినిమా జీవితంతో పాటు కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు బాలకృష్ణ వేసినట్లు తెలుస్తోంది.
పవన్ ఎపిసోడ్ ఖచ్చితంగా ఆహా “అన్ స్టాపబుల్” అన్ని ఎపిసోడ్స్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని.పవన్, బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.







