సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో భాగంగా ఈయన ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలో అయినటువంటి జాక్వలిన్ ఫెర్నాండిస్, నోరా ఫతేహి పేర్లను కూడా చెప్పడంతో ఇది అధికారులు వీరి పేర్లను కూడా జోడించి వీరిని కూడా విచారణ చేపడుతున్నారు.
ఇప్పటికే అధికారులు జాక్వలిన్ ఫెర్నాండిస్ విచారించగా తాజాగా నోరా ఫతేహి కూడా విచారణకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే వీరి స్టేట్మెంట్లను రికార్డు కూడా చేశారు.
తాజాగా ఈమె ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో తన స్టేట్మెంట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా నోరా ఫతేహి మాట్లాడుతూ అసలు సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆయనని నేరుగా నేను ఈడీ ఆఫీసులోనే చూసానని ఈమె వెల్లడించారు.ఆయన ఎస్ఎల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారని అనుకున్నాను ఆయన నాకు తన స్నేహితులు అయినటువంటి పింకీ ఇరానీ ద్వారా మాత్రమే తెలుసని నోరా ఫతేహి వెల్లడించారు.అయితే సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం నేను తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఒక పెద్ద ఇంటిని గిఫ్టుగా ఇస్తానని తనకు ప్రపోజల్ పంపించారని తెలిపారు.

ఈ ప్రపోజల్ తను నేరుగా నాకు చెప్పలేదని పింకీ ఇరానీ ద్వారా తనకు ఈ విషయాన్ని చేరవేశారు అంటూ ఈ సందర్భంగా నోరా ఫతేహి సుఖేష్ చంద్ర శేఖర్ గురించి వెల్లడించారు.ప్రస్తుతం నోరా ఫతేహి సుఖేష్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె పలు బాలీవుడ్ టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.తెలుగులో ఈమె టెంపర్ సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సందడి చేశారు.
ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ఇరుక్కుపో హత్తుకొని వీర వీర అనే పాట ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.







