బుల్లితెరపై టాక్ షోలకి డిమాండ్ మామూలుగా ఉండదు.ఈమధ్య బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక బాలీవుడ్ లో అయితే కాఫీ విత్ కలర్ లాంటి షోలు అనేకం నడుస్తూనే ఉంటాయి.ఇక అప్పట్లో తెలుగులో మంచు లక్ష్మి చేసిన టాక్ షో మీకు గుర్తుండే ఉంటుంది.
లక్ష్మీస్ టాక్ షో పేరుతో ఈ షో అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది.అలాగే ప్రేమతో మీ లక్ష్మి అంటూ కూడా ఆమె మరొక టాక్ షో చేసింది.
మంచు లక్ష్మి తన గజిబిజి తెలుగుతో బాగానే సక్సెస్ఫుల్ గా ఈ షోను రన్ చేసింది.

అయితే ఇటీవల టాక్ షో లకు ఇంత డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మంచు లక్ష్మి మాత్రం తన షో నీ ఆపేసింది.అమే టాక్ షోలు ఆపడానికి గల ముఖ్య కారణం ఇటీవల ఆమె ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.చాలామంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా రావడానికి ఇబ్బంది పెట్టడంతోనే మంచు లక్ష్మి తన టాక్ షో ను ముందుకు తీసుకెళ్ల లేకపోయిందట.
తన స్నేహితులు మాత్రం అందరూ షోకి వచ్చారని షో కొనసాగించాలంటే చాలామంది సెలబ్రిటీలు ఒప్పుకోవాలి అని లేని పక్షంలో టాక్ షోలు జరగవు అంటూ తెలిపింది మంచు లక్ష్మి.

ఇక అందుకు ఒక ఉదాహరణ కూడా ఆమె మీడియాతో పంచుకుంది అనుష్క భాగమతి సినిమా టైంలో తన టాక్ షో కి రావడానికి ఒప్పుకుంది అని, కానీ ఆమె భాగమతి ప్రమోషన్స్ లో భాగంగా రాజమండ్రి వెళ్లడంతో తన ఫోన్ ఆన్సర్ చేయలేని స్థితిలో ఉండి రెండు రోజుల పాటు మంచు లక్ష్మికి అందుబాటులోకి రాలేకపోయిందట.ఆ టైంలో లక్ష్మీ చాలా పానిక్ అయిపోయి చాలా మెసేజ్ లు అలాగే కాల్స్ చేయడంతో తిరిగి ఇంటికి వచ్చిన అనుష్క వాటిని చూసి షాక్ గురైందట.నేను వస్తానని చెప్పిన అన్ని సార్లు ఎందుకు కాల్స్ చేశావు అని లక్ష్మిని అడిగిందట.
దాంతో తనకు ఏర్పడ్డ భయాన్ని అనుష్కతో పంచుకుందట మంచు లక్ష్మి.ఇలాంటి సంఘటనలను ఎక్కువగా తీసుకోవడానికి తనకు ఇష్టం లేకపోవడంతోనే టాక్ షో ఆపేసిందట మంచు లక్ష్మి.







