బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్ల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతాయని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.కేంద్రం చేతకానితనాన్ని ప్రశ్నించేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇంతకాలం ప్రజలు వంచించబడ్డారన్న కేసీఆర్… ఇకపై కేంద్రం మెడలు వంచాలని చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ తిట్ల పురాణం అవసరమా అని ప్రశ్నించారు.దేశంలో 4 లక్షల 10 వేల మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉందని తెలిపారు.
ఎన్సీఎల్టీ పంచాతీలో తెలంగాణలో తప్ప దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయని ఆరోపించారు.దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ కు ఖర్చు అయ్యేది కేవలం రూ, లక్షా 45 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.
ఎండలో, వానలో, చలిలో రైతులు ధర్నా చేసే దుస్థితి ఎందుకుందని అడిగారు.ఈ నేపథ్యంలోనే రైతుబంధు పథకం దేశ వ్యాప్తంగా అమలు చేయాలనేది బీఆర్ఎస్ డిమాండ్ అని కేసీఆర్ స్పష్టం చేశారు.







