జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా మరోవైపు సినిమాలలో నటిస్తూ నటిగా బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మీ మూగజీవాలను ఎవరైనా హింసిస్తే ఏమాత్రం సహించదు సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తులకు సరైన శిక్ష పడే వరకు ఈమె పోరాటం చేస్తూ ఉంటారు.ఇలా ఎన్నోసార్లు మూగజీవాలను హింసించిన వారిపట్ల సోషల్ మీడియా వేదికగా రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇక సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందెలకు ఫేమస్ అనే విషయం మనకు తెలిసింది.ఈ క్రమంలోనే ఒక డాక్టర్ సోషల్ మీడియా వేదికగా ఈ సంక్రాంతి పండుగకు తాను కోడిపందాలలో రెండుసార్లు గెలిచానని ఈ పండుగను తాను ఎంతో ఎంజాయ్ చేశాను అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.అయితే ఈస్క్రీన్ షాట్లను రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నీ డాక్టర్ సర్టిఫికెట్ ను మురికి కాలువలో పడేయి… ఇలా హింసను ప్రోత్సహిస్తున్నారా అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా చర్చలు జరిగాయి.అయితే ఒక నెటిజన్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ కోడికి లేని బాధ మీకు ఎందుకు మేడం… ఇది గర్వం కాదు మా సాంప్రదాయం అంటూ ట్వీట్ చేశారు.ఇక రష్మిక నేటిజన్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ తనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కోడికి బాధ లేదని మీకు ఎలా తెలుసు.అయినా మీరు మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు.
గ్లాడియేటర్ పోరాటాలు సంప్రదాయాల్లో భాగమే.వాటిని స్వీకరించి చనిపోయే వరకు పోరాడటానికి మనుషులను పంపించాలనీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.