పేకాట.కేవలం సామాన్య వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఏమాత్రం ఖాళీగా ఉన్నా బాలీవుడ్ లో కొందరు పేకాటలో మునిగిపోతున్నారు.మామూలుగానే పేకాటరాయుళ్లకు కొత్త గ్యాప్ దొరికితే చాలు ఒక ఆట ఆడుతూ ఉంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు రావడంతో అందులోనూ బాలీవుడ్ నుండి పెద్దగా సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో పేకాటను షురూ చేశారు.ఇప్పటికే చాలా చోట్ల పేకాటలు షురూ అయినట్టు తెలుస్తోంది.
కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా పేకాటను మొదలుపెట్టేశారు.
అయితే కొంతమంది నిర్మాతలు ఆంధ్ర బాట పట్టారు.
మిగిలిన వాళ్ళు ఇక్కడి స్టార్ హోటళ్లను ఆశ్రయించారు.హైదరాబాదులోని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లోని స్టార్ హోటళ్లు చాలామంది పేకాటకు ఆశ్రయమిచ్చాయి.
ఈ పేకాటలో హీరోలు కూర్చోవడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది అని చెప్పవచ్చు.ఎందుకంటే హీరోలు నిర్మాతలతో కంటే ఎక్కువగా సన్నిహితులతోనే కూర్చుంటారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఒక టాప్ హీరో తన సన్నిహితుడైన ఒక భారీ బ్యానర్ నిర్మాత తో కలిసి ఇంట్లోనే సిట్టింగ్ వేసినట్టు తెలుస్తోంది.

ఆ నిర్మాత ఇంట్లోనే ఆ టాప్ హీరో నిర్మాత ఇద్దరూ కలిసి పేకాట ఆడినట్టు తెలుస్తోంది.పేకాటతో పాటు మందు కూడా తాగుతూ లేట్ నైట్ వరకు జోరుగా ముచ్చట్లు సాగినంత తెలుస్తోంది.అంతేకాకుండా సదరు హీరో విదేశాలకు వెళ్ళినప్పుడు సదరు నిర్మాత ఇంట్లోనే కొద్ది రోజులపాటు ఉన్నట్టు తెలుస్తోంది.
అలా మొత్తంగా టాలీవుడ్ తో బాలీవుడ్ లో సంక్రాంతి సందర్భంగా పేకాటలు అయ్యాయి.సంక్రాంతి నుండి టాలీవుడ్ బయటపడడానికి ఇంకా రెండు రోజులు సమయం పడుతుందని చెప్పవచ్చు.







